నమస్కారములు
భరణి గారు, మిమ్మల్ని చాలా దినములుగా సంప్రదించాలని అనుకున్నాను కానీ భయంతో ఆ పని చేయలేదు. కారణం, మీ గొప్పతనం నా పేదతనానికి అడ్డు వఛిన్ది. గొప్పతనం అంటే మీ అభిరుచి, మీ ఔన్నత్యము, మీ మనసు.
అయితే అన్నిటికన్నా ముఖ్యం మీరు తీసిన మిథునం, నాలో ఒక చిగురాశ రేపింది
దానికి నేను రాసిన విశ్లేషణ ఇక్కడ అందిస్తున్నాను
ఈ విశ్లేషణ చదువుతారు అని ఆశిస్తున్నాను.
మిమ్మల్ని కలిసి సంభాషించాలని ఉంది తెలుగుని ప్రపంచ వెలుగులోకి, మురికిలో ఉన్న తెలుగు సినిమాకి నలుగు పెట్టి మరీ నలుగురిలోకి తీసుకు వెళ్ళే సామర్థ్యం మీకు ఉంది. అందుకే మీతో పని చేయాలని ఉంది.
అసందర్భం అని అనుకోకపోతే, ఒక అభ్యర్థన. నేను 2007 లో "పూర్ణిమ" అనే ఒక కథను, Script గా రాసుకున్నను.
ఇది ఒక అమ్మాయి కథ, ఆ కథనం మీకు వివరించాలని ఉంది. ఇది అచ్చ తెలుగులో నేను రాసుకున్న ఒక కథ, దీనికి ఆధారం, ఒక నిజమైన సంఘటన.
మీరు మా లాంటి అభిమానులకు ఇచ్చిన వెసులుబాటును వాడుకుని మిమ్మల్ని దరి చేరాలి అనే చిన్న ప్రయత్నం ఇది.
వీలు చూసుకుని సమాధానం ఇస్తారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ,
మీ
భరద్వాజ
No comments:
Post a Comment