Showing posts with label Kavitha. Show all posts
Showing posts with label Kavitha. Show all posts

Thursday, April 23, 2026

సుందరివో


సుందరివో, నీ నవ్వులోని వెన్నెల

మంజరివో, పూవుల్లో దాగే తేనెలా

నీ ఒడిలో సో…..లితే

నేనే నువ్వయ్యాలే 


నువ్వుంటే గుబులు దిగులు చింత అన్నీ సద్దుకుపోయే

లేకుంటే పున్నమి రేయి వెన్నెల కూడా బోసిపోయే

ఎందుకంటే నీవే

ప్రేయసివో, నా గుండె లోని లయవో


నువ్వుంటే ఎన్నేళ్లైనా హాయే మాయే ఓ నిమిషం లా

లేదంటే హిమమే లేని ప్రాణం లేని ఓ హిమగిరి లా

అందుకని నీవే

సుందరివే, నా మనసు రాగ శ్రుతివే


సుందరివే, నీ నవ్వులోని వెన్నెల

మంజరివే, పూవుల్లో దాగే తేనెలా

నీ ఒడిలో సో…..లితే

నేనే నువ్వయ్యాలే 

నిదుర పో రా కన్నయ్య


నిదుర పో రా కన్నయ్య నిదుర పో రా 

నిదుర పో రా కన్నయ్య నిదుర పో రా


తనువు మనసు సేద తీర హాయిగా నిదుర పో 

తపన విడిచి మెల్లగాను నిదురలోకి జారుకో


నిదుర పో రా కన్నయ్య నిదుర పో రా 

నిదుర పో రా కన్నయ్య నిదుర పో రా


జో... లాలి జో.. లాలి జో లాలి జో


ఆటలో… తెలియకున్నది కాలము 

అలసటే… తెలియదన్నది ప్రాయము 


అమ్మ ఒడిలో పవళించి ఈ జోలనే ఆలకించి 

అమ్మ ఒడిలో పవళించి ఈ జోలను ఆలకించి


జో... లాలి జో.. లాలి జో లాలి జో 


నిదుర పో రా కన్నయ్య నిదుర పో రా

చెలియా…ఈ దూరం చాలదా


చెలియా…ఈ దూరం చాలదా

సఖియా…ఈ భారం తీరదా


ఓ చెలి… నా సఖి

నా… దరి చేరవా

ఈ… నిశి…నీవే శశి

దారినే చూపవా 


చెలియా…ఈ దూరం చాలదా

సఖియా…ఈ భారం తీరదా


కన్నుల్లో కదలాడి

కనుపాప అయ్యాక

కనుమరుగై పోతే ఎలా

వెన్నెల్లో ఒడి చేరి

తెలవారి పోయిందని

వదిలేసి వెళితే ఎలా


శిల అయిన నన్ను శిల్పాన్ని చేసావే 

ఉలి అయిన నీ ఉనికితో…

కలలాంటి స్వర్గాన్ని నాకందించావే 

చేరువ అయి నీ ప్రేమతో…


చెలియా…ఈ దూరం చాలదా

సఖియా భారం తీరదా

Friday, January 27, 2023

KANNAMMA - SONG - LYRICS

 


KANNAMMA LYRICS - TELUGU

కడలి పై వెన్నెల
పుడమి పై కుసుమమై
పుసెనుగా ఓ రూపమై
నువ్వే గా కన్నమ్మ

వేకువ లో మిహిరానికి
వేచి చూసే రేయికి
వెలుగు చూపే తొలి కిరణం
నువ్వే గా కన్నమ్మ

LYRICS TRANSLATION IN ENGLISH

Moonlight on the sea
Has blossomed as a flower on earth
As you my beloved Kannamma 

Like the night awaits
For the first rays of dawn
The one who gives light as first ray of sun
Is my beloved Kannamma 


JO LAALI - SONG - LYRICS

 

JO LAALI LYRICS - TELUGU


కలలెన్నో... కన్న మా కళ్ళ కే

కనుపాపవయ్యావు నీవే

ఊహల్లో ఊగేటి మా ప్రేమకే 

రూపానివయ్యావు నీవే


పదిలంగా పది నెలలు

ఒదిగొదిగి ఉన్నావుగా

ఇక చాలు ఆ వెతలు

నిదురించు మా పాపవై


జో.. లాలి జో.. లాలి జో.. లాలి జో..లాలి


ఎంతో యాతన ఎంతో వేదన

అనుభవించిన నీవే 

ఎదురుచూపులు మా పడిగాపులు

మైమరిపించిన నీవే


మృదువైన... కదలికలు మేమే తిలకించగా

మధురంగా... సరిగమలు నీకే వినిపించగా


జో.. లాలి జో.. లాలి జో.. లాలి జో..లాలి ।।4।।

Monday, January 20, 2014

చిట్టి చెవులు

రోజు చేసే ప్రయాణంలో ఓ సన్నివేశం 
కలిగించెను మదిలో ఆలోచనల సమావేశం 
తండ్రి బండి నడపగా, తల్లి ఎత్తుకోగా 
అ పసి కళ్ళలో చెణుకులు 
అందించింది నాకు మధుర సందేశం 
అమ్మ పాటలు వింటూ హాయిగా నిదురించే ఆ వయస్సు 
శబ్దానికి అర్ధం తెలియని మనస్సు 
ఈ శబ్దాల రొద ఎలా భరిస్తోంది 
ఆ చిట్టి చెవులు ఎంత రోదిస్తున్నాయో 
ఎవరు వీరంతా ఎందుకున్నారు ఇక్కడ
ఈ ప్రయాణం ఏమిటి, మరి గమ్యం ఎక్కడ 
ఇలా ఎన్నో సందేహాలు ఆ బుజ్జి మనసుకి

Sunday, January 19, 2014

ఏవి ఏవి

ఏవి ఆ సహజ సిద్ధమైన పర్వతాలు 
ఏవి ఆ ప్రక్రుతి ఐరావతాలు 
మన పండుగలు ఏమయ్యాయి, మన పద్ధతులు ఎలా మారాయి 
పల్లె పిల్లల కొంటె పనులు, ఆ కోటి కొమ్మొచ్చి ఆటలు 
వసంతాన కోయిలమ్మ పాటలు 
వెన్నెలలో ఆడుకునే సయ్యాటలు 
లంగా ఓణీలు కట్టుకుని మురిపించె పడుచు పిల్లలు 
ఊరంతా పండగలా జరిగే మన పెళ్ళిళ్ళు 
ప్రతి పండగకు హారతులు పట్టే చెల్లెళ్ళు 
ఏడిపించి ఊరిస్తూ తిరిగే కొంటె మరదళ్ళు 
ఏమయ్యాయి మన సంప్రదాయాలు, వైభోగాలు 
మళ్ళీ ఆ రోజులు వస్తాయి అని ఎన్నో ఆశలు 
అవి రావి అని తెలిస్తే మరల నిరాశలు 
నాలుగు పైసల కోసం ఏమేమి కోల్పోయాం 
అన్నీ సంపాదించి ఆనందాన్ని కోల్పోయాం 
ప్రతి రోజునీ ఒక పరుగులాటగా మార్చుకున్నాం 
ఎటు నుంచి ఎటు వచ్చాం 
ఇక ఇటు నుంచి ఎటు వెళ్తాం 

నీ హాయి

ఈ వేకువ నీ మోము నూతనంగా ఉందేమి?
అన్ని సోయగాలు కలిగి అధునాతనంగా ఉందేమి?
ఏమి కలలు కన్నావో నిన్నటి రేయి 
నా గురించే అన్న భావనలో ఎంతో హాయి 
నావి కాదు అని తెలిసినా, నీ కలలు నిజమవ్వాలి 
నీ హాయి కలకాలం నిలవాలి

Tuesday, December 31, 2013

తొలిసారి

తొలిసారి నిన్నే చూసి నా మనసే పులకించెను 
ఏదో అయిపోయెను ఏమీ మహిమా?
దీనిని ప్రేమే ప్రేమే అననా, లేక ఆకర్షణే అననా, ఏమీ మహిమా?

స్వర్గమే కనిపించే నీ కళ్ళలో, నీవే గుర్తొచ్చే నా మదిలో 
ఏమిటో గానీ దీని పేరు, ఎంతో హాయినిస్తోంది నాకు 
దీనిని ప్రేమే ప్రేమే అననా, లేక ఆకర్షణే అననా , ఏమీ మహిమా?

నా జీవితం నీకంకితం, నా హృదయం నీ సర్వస్వం 
నా ధ్యాస లోనూ నీవే, నా శ్వాస లోనూ నీవే 

ఓ హృదయమా ఇదే ప్రేమనీ తెలుసునా
తొలిచూపులో ప్రేమ కలిగెను మనసునా

నీవే నా ప్రియతమా నీవే నా ప్రాణమా? 
నీవే జీవితమా ఈ ప్రేమ శాశ్వతమా?

Monday, December 30, 2013

ఎన్నెన్నోఆశలు

ఎన్నెన్నో ఆశలూ, కొన్నైనా తీరవే? 
ఈ హృదయ జ్వాలలు కలనైనా ఆరవే? 
ఎంత నీరు పోసినా ఈ మంటలు అసలారనే ఆరవే?
ఎన్ని కలలు కన్నా ఈ నయనాలు కలలు కనటం మానవే? 
అది కలనైనా నిజం కాదు, నా ఆశ అటువంటిదా?
మది క్షణమైనా ఊరుకోదు నా ధ్యాస అటువంటిదా? 
దీని కారణం నీవే చెలి, నా జీవనం నీకే సఖీ ఇక కరుణించవా?
నా ధ్యాసలో నీవే మరీ నా ఆశనూ నీవే మరీ ఇక కనిపించవా?

తీరెనుగా ఆశలూ పండెనుగా నా కలలు 
ఆరెనుగా జ్వాలలు వీడెను నిట్టూర్పులూ

Monday, December 23, 2013

శివ పూజకు - FEW LYRICS TRANSLATION

పరుగాపక పయనించవె తలపులనావా 
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ 
ఎదిరించిన సిడిగాలిని జయించినావా 
మది కోరిన మధుసీమలు వరించి రావా 

I love the song "Siva Poojaku" from the Telugu film "Swarna Kamalam" and especially these above lines. 
I just re-interpreted these lines, in my perspective and hope so these are liked.

O Mind, let the thoughts travel without a stop
By bowing to tides, you won't reach the top
Win the airs of hinderances by being strong
Then you shall own the heavens you sought for so long

Monday, September 9, 2013

కాళోజీ జ్ఞాపకార్థం

ఆ కళ్ళు కళలకు ఆకళ్ళు 
ఆకళ్ళ కలలు ఆకళ్ళు 
కళలకు కళ్ళు ఆకళ్ళు 
కలలు ఆకళ్ళ ఆకళ్ళు   

-----కాళోజీ నారాయణరావు


These are the words of Kaloji Narayana Rao about the hunger deaths of our farmers.
This is in his memory of his 99th Birthday today (9th September). Sad that such poets have been forgotten by most of the youth. Hopeful that such poets shall be embraced and remembered for long. 

Saturday, November 24, 2012

ఈ దూరం

మధుమాసపు వేళ మరుమల్లెలు తాకగా
నీవేనేమో అని పులకించా
అది నీవు కాదని తెలిసినప్పటికీ
నీ స్మృతుల్లో జీవించా
నిన్ను కలవాలనుకున్నా ఈ క్షణం
కానీ కలవకుండా బంధించింది ఈ దూరం
నీ నామమే పలికింది నాలోని మౌనం
అది తెలిపింది నీ నామ స్మరణ అతి మధురం
ఎంతో భారంగా అనిపిస్తున్నా ఈ దూరం
నీ తలపులతో అయ్యింది గాలి కన్నా స్వల్పం

Wednesday, November 21, 2012

అతిశయం

సంధ్యా సమయాన సముద్ర తీరాన
చూసాను ఒక మధుర సన్నివేశం
అదే నీ రూపం, అది కలిగించింది నాలో పరవశం
మనసు నీ కోసం తపించింది
మది కేవలం నిన్నే తలచింది
అల లాగా ఎగసిన హృదయానికి నీవే తీరం
తనువు నీదై పోయింది, కావాలనుకుంది నీ సమీరం
ఇది మోహమో వ్యామోహమో తెలియదు కానీ
అందంగా ఆనందంగా ఉంది ఈ అనుభవం
నీతో మాట్లాడాలని ఉన్నా ఏదో తెలియని భయం
ఈ వ్యవహారం మొత్తానికీ నీవే కారణం
ఇది మాటల్లో చెప్పలేని అతిశయం


Tuesday, November 20, 2012

నా శ్వాస నా ధ్యాస

నా శ్వాస నీవేనని
నా ధ్యాస నీవేనని, తెలిపింది నా హృదయం

నీ కోసమే నేనూ, నీ రాకకే నేనూ
ఎదురుచూసి అలసి సొలసి
విసిగిపోయా అలసిపోయా ఎందుకీ దూరం?
మాటలాడాలని ఉన్నా ఎందుకీ మౌనం ?
ప్రియా నీ రూపు చూస్తున్నా కనిపించ లేకున్నా ఇదే నా మోహం?
ప్రియా నీ ప్రక్కన కూర్చున్నా దగ్గర లేకున్నా ఇదే వ్యామోహం

Tuesday, June 12, 2012

ప్రేమ వర్షం

దిశ నెరుగని మేఘమైన నాకు, నీ ఉనికిని తెలిపావు 
మన కలయికని స్నేహం అని అంటే అది ఉరుము అని తెలిపావు 

పిడుగై రాలుతోన్న నాకు మెరుపుని అందించావు 

మరి క్షణమే కదా అది నిలిచేది అని అంటే కాదు కలకాలం అన్నావు 

"కోపం క్షణ భంగురం కాని ప్రేమ అను నిత్యం 

వర్షం ఒక మారు కురిసినా అది నిలిపే సంద్రం  నిత్యం, సత్యం"

Saturday, June 9, 2012

నా చెలి

కనుల వెలుగులో శయనించాలని ఉంది 
అధరాల తెలుగులో పయనించాలని ఉంది  

చిరున్నవ్వులోని హాయి లో ఈ రేయి గడపాలని ఉంది 
సిగపువ్వు నై  తనకి నాలో సుగంధాన్ని నింపుకోవాలని ఉంది 

మధురమైన మాటల తేనెలలో మునుకలు వేయాలని ఉంది 
తన ఉనికి తెలిసినంతనే తన చెంతకు ఉరకలు వేయాలని ఉంది 

మనసులో భావములన్ని తనతో పంచుకోవాలని ఉంది
నా చెలి తను, తనను రాణిని చేసి రాజ్యాన్ని పరిపాలించాలని ఉంది

Wednesday, May 2, 2012

సందడి చేస్తున్నవి నా మనసులో

దొరకని వలపుల పలకరింపులు, 
దొరికిన చనవుల కేరింతలు 
సందడి చేస్తున్నవి నా మనసులో

ఝరుల పరవళ్ళు అలల నురగళ్ళు,
శరత్ వెన్నెలలూ వసంతపు కోయిలలూ 
సందడి చేస్తున్నవి నా మనసులో

తుమ్మెదల ఆటలూ తూనీగల పాటలూ, 
ఊరు బయట దోబూచులాడిన సయ్యాటలూ 
సందడి చేస్తున్నవి నా మనసులో

నీ కుసుమాల కనురెప్ప తలుపులు,
నీ మధుర అధరాల పిలుపులు 
సందడి చేస్తున్నవి నా మనసులో

నీ దర్శనమే నా ప్రేమకు నిదర్శనమని 
కొమ్మలలోని గువ్వలూ, కొలనులోని చేపలూ 
సందడి చేస్తున్నవి నా మనసులో

Sunday, April 8, 2012

కష్టజీవి

కష్టజీవికి ఎప్పుడూ కష్టమే ఇష్టం
వాడికి క్షణకాలమైనా తీరికగా గడపటం చాలా కష్టం
కష్టం చేసే వాడికి ఫలితం దొరకకపోవచ్చు
ఫలితాన్ని అనుభవించే వాడికి కష్టం తెలియకపోవచ్చు
అయినా ప్రపంచం సాగిపోతూనే ఉంటుంది
ఎవరూ బాధపడరు అలాగని ఎవరూ సుఖపడరు
ఎవరికీ నష్టం ఉండదు అయినా ఎవరికీ ఇష్టం ఉండదు
అయినా ప్రపంచం సాగిపోతూనే ఉంటుంది
కష్టం చేసే వాడికే ఫలితం దొరికినప్పుడే
ఫలితం దొరికినవాడికే కష్టం విలువ తెలిసినప్పుడే
ఈ ప్రపంచం పరిపూర్ణత పొందుతుంది
కానీ, ఈ ప్రపంచానికి పరిపూర్ణత అక్కరలేదు కాబోలు
అందుకే ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుంది

ఇదే ప్రపంచం

కనులకు కనబడునా గాలి నాట్యములు
చెవులకు వినబడునా చిరు గడ్డి సవ్వడులు
అయినా మనసు నమ్ముతుంది వాటిని
మది తెలుసుకొగలదా నదుల సరిగమలు
లేక కనుగొనగలదా చెట్ల భావములు
అయినా మనసు నమ్ముతుంది వాటిని
ఇంత భావాత్మక మనసును సైతం మార్చేస్తుంది ఈ ప్రపంచం
ఏ ప్రభంజనం లేక ప్రళయం వస్తే మారుతుందో ఈ ప్రపంచం
అయినా ప్రస్తుతానికి ఇదే మన ప్రపంచం

About Me

My photo
I firstly declare here that all the content written in the blog is exclusively written by me and I hold the copyrights of each and everything. Be it a poem or a movie review. Also, the videos or photographs I upload or attach are exclusively owned by me. This declaration is important in a world that seems so worried of piracy. The prime purpose of these blogs is to put my writings and photographs on the net. and well to start with.... I live in my mind, and existence is the attempt to bring my thoughts into physical reality, I celebrate myself, sing myself and I am always happy in my own company.....I am not the best in the world but I strive for excellence and thats what keeps me alive... Talking much about oneself can also be a means to conceal oneself--Friedrich Nietzsche