కనుల వెలుగులో శయనించాలని ఉంది
అధరాల తెలుగులో పయనించాలని ఉంది
చిరున్నవ్వులోని హాయి లో ఈ రేయి గడపాలని ఉంది
సిగపువ్వు నై తనకి నాలో సుగంధాన్ని నింపుకోవాలని ఉంది
మధురమైన మాటల తేనెలలో మునుకలు వేయాలని ఉంది
తన ఉనికి తెలిసినంతనే తన చెంతకు ఉరకలు వేయాలని ఉంది
మనసులో భావములన్ని తనతో పంచుకోవాలని ఉంది
నా చెలి తను, తనను రాణిని చేసి రాజ్యాన్ని పరిపాలించాలని ఉంది
No comments:
Post a Comment