దొరకని వలపుల పలకరింపులు,
దొరికిన చనవుల కేరింతలు
సందడి చేస్తున్నవి నా మనసులో
ఝరుల పరవళ్ళు అలల నురగళ్ళు,
శరత్ వెన్నెలలూ వసంతపు కోయిలలూ
సందడి చేస్తున్నవి నా మనసులో
తుమ్మెదల ఆటలూ తూనీగల పాటలూ,
ఊరు బయట దోబూచులాడిన సయ్యాటలూ
సందడి చేస్తున్నవి నా మనసులో
నీ కుసుమాల కనురెప్ప తలుపులు,
నీ మధుర అధరాల పిలుపులు
సందడి చేస్తున్నవి నా మనసులో
నీ దర్శనమే నా ప్రేమకు నిదర్శనమని
కొమ్మలలోని గువ్వలూ, కొలనులోని చేపలూ
సందడి చేస్తున్నవి నా మనసులో
సందడి చేస్తున్నవి నా మనసులో
No comments:
Post a Comment