Sunday, April 8, 2012

తొలి పలుకు

ఆ కుసుమ కోమల ఆధారాల పై నేడు చిరునవ్వు విరిసెను
ఆ మధుర గానము విని కోయిల అబ్బుర పోయెను
మొదటి సారి మాటాల జల్లు కురిసెను
విన్న వారి హృదయాన హరివిల్లు విరిసెను
ఏమి మాధుర్యం ఆ పలుకులో
ఏమి వయ్యారం ఆ పసి కులుకులో
అమ్మ అని ముద్దుగా పలికింది ఆ బుజ్జి అధరము
ఆశ్చర్యపోయాయి గగనము భూతలము
మొదటి పలుకులో ఉన్న తీయదనము
మొదటి అనే భావనలో ఉన్న కమ్మదనము
కలకాలం నిలుస్తుంది మదిలో ఆ జ్ఞాపకము
ప్రతి పలుకుతో కావాలి అది ఉన్నతమైన జీవితము
ప్రతి శిశువుకి, ఇదే నా మనస్పూర్తి ఆశీర్వాదము

No comments:

Post a Comment

About Me

My photo
I firstly declare here that all the content written in the blog is exclusively written by me and I hold the copyrights of each and everything. Be it a poem or a movie review. Also, the videos or photographs I upload or attach are exclusively owned by me. This declaration is important in a world that seems so worried of piracy. The prime purpose of these blogs is to put my writings and photographs on the net. and well to start with.... I live in my mind, and existence is the attempt to bring my thoughts into physical reality, I celebrate myself, sing myself and I am always happy in my own company.....I am not the best in the world but I strive for excellence and thats what keeps me alive... Talking much about oneself can also be a means to conceal oneself--Friedrich Nietzsche