పసిడి గాజు, నేల మట్టి అన్నీ రుచిస్తాయి ఆ నోటికి
తోటి పాప, పేద ముసలి అందరూ పడుచులే ఆ కళ్ళకి
కల్మషం, విచక్షణా లేవు ఆ మనసుకి
ప్రతిదీ ఓ అందం, ఆనందం ఆ వయసుకి
నీటితో ఆటలు, కోయిలతో పాటలు
అమ్మ లాలీ, నాన్న కేళి అందరితో సయ్యాటలు
ఎంత హాయి ఆ జీవితం అదే అసలైన స్వతంత్రం
మళ్ళీ విహరించాలని ఉంది ఆ లోకంలో
మునకలు వేయాలని ఉంది మళ్ళీ ఆ మైకంలో
అసాధ్యమైనవి ఎన్ని సాధించినా ఇది సాధించడం అసాధ్యం
అయినా ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ జీవించినప్పుడే ఈ జన్మ సుసాధ్యం

No comments:
Post a Comment