స్నేహ, వరుణ్ ఇద్దరూ ఏడాది క్రితం Facebook లో కలిసారు, నాలుగు సార్లు కలుసుకున్నారు, భావాలు ప్రకటించుకున్నారు . కలిసి బ్రతకాలి అని నిశ్చయించుకున్నారు. స్నేహ తన వాళ్ళతో వరుణ్ గురించి చెప్పినా, వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. అందుకని ఈ రోజు తల్లితండ్రులని పరిచయం చేసి, వరుణ్ ఎలాంటివాడో అని ప్రత్యక్షంగా చూపించి, వాళ్ళని ఒప్పిద్దాం అనుకుంది.
పరీక్ష స్నేహకి కాదు, వరుణ్ కి. సమాధానాలు చెప్పవలసిన బాధ్యత వరుణ్ మీద ఉంది కాబట్టి.
తలుపు తట్టి లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఎదురుకుండా స్నేహ అమ్మా, నాన్నా ఉన్నారు, కొంచెం దూరంగా ఉంది స్నేహ కూర్చుంది.
"నువ్వేనా వరుణ్ అంటే" అని నాన్న గట్టిగా అడిగాడు
"అవునండి" అని వరుణ్ సూటిగా చూసుకుంటూ చెప్పాడు
"ఏం చేస్తుంటావు"
"ఒక I.T. Company లో Developer గా చేస్తున్నా"
"ఏ మాత్రం వస్తుంది ఏంటి" అని వెటకారంగా అడిగాడు ఆ పెద్ద మనిషి
"స్నేహకి కష్టం రాకుండా చూసుకునే అంత" అని స్నేహ వైపు చూస్తూ అన్నాడు
"తను డాక్టర్, MDS చేస్తే పెద్ద సంపాదన ఉంటుంది మరి, నీ సంపాదన కంటే చాలా ఎక్కువ"
"నిజమే, కానీ తను చదువు అయిపోయే లోపు, తనకంటే ఎక్కువ సంపాదించలేను , అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?"
"లేదు, అయితే, ఈ రోజున తనకి MDS లో Admission వస్తే నువ్వు చదివిస్తావా?"
"తప్పకుండా"
"ఎలా చెప్తున్నావు"
"ఏడాదికి 5 లక్షలు సమకూరుస్తాను ప్రస్తుతానికి, అవి ఇచ్చి, మిగిలనిది ఏమైనా ఉంటే,ఈ లోపు, ఇంకో వృత్తి చూసుకుంటా, లేకపోతే ప్రవృత్తిని వృత్తిగా మలచుకొని, తనకి చదువుకి చేయగలిగిన ఆర్ధిక సహాయం చేస్తాను, ఒక్క మాటలో చెప్పాలంటే తను అనుకున్నది సాధించడానికి, నేను చేయగలిగిన నీతి బద్ధమైన పనులు చేస్తాను"
"Script బాగా రాసుకున్నావు, కథలు రాస్తుంటావా?"
"మనసులోంచి వచ్చే మాటల వెనుక కథ, కథనం, కూర్పు ఉండాల్సిందేనా?"
"తెలుగు తట్టుకోలెకపోతున్నా, సరే కానీ మీది ఏ కులం?"
"ఎవరూ లేని అనాథకి కులం ఎక్కడుంటుంది"
"ఓ Sorry, మరిచాను, స్నేహ చెప్పింది"
"ఫర్వాలేదు, మనసుని గ్రహించారు"
"హుమ్….స్నేహ, బావుందమ్మా, ఎవరూ లేకున్నా మనసుంది, మంచి ప్రేమికుడు, బాగా ప్రేమిస్తాడు"
"తను, నేను ప్రేమించాను అని చెప్పిందా?"
"కొంపదీసి ప్రేమించటం లేదా ఏంటి?"
"నిజానికి, నాకు ప్రేమ తెలియదు, అది ఎలా ఉంటుందో అని"
"మరి ఏం తెలుసో?"
"తన నవ్వు నిజం. ఆ నవ్వు నిలపుకోడానికి ఏమైనా చెయ్యడం నాకు ఇష్టం"
"దిగులు లేదు. తండ్రి మనసు అర్థం చేసుకున్నావు. మీ పెళ్ళి కి మా ఆశీర్వాదం ఉంది"
స్నేహ నవ్వింది, అందరూ ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడుకున్నరు.