PAGES

Sunday, April 1, 2012

నడువు నడువు

నడువు నడువు,
వడి వడిగా విడి విడి అడుగులతో
నిజాల గొడుగుతో 
జీవిత సొరుగులోకి  
నడువు నడువు
వడి వడిగా విడి విడిగా

కలిసి బ్రతుకు, కలిసి మెలుగు
అలసి సొలసి మళ్ళీ పరుగు
ఒంటరిగా ఒంటరి బాటలో
సత్య కాగడా చేబట్టి
అబద్ధాల కలుపుగోలు ప్రక్కన పెట్టి,
నడువు నడువు 
వడి వడిగా విడి విడిగా.

No comments:

Post a Comment